సీతారాం ఏచూరి మరణం దిగ్భ్రాంతికరం: మార్కాపురం వైకాపా నేత ఉడుముల కోటిరెడ్డి
ప్రకాశం న్యూస్, మార్కాపురం: వర్తమాన రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరొందిన సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని మార్కాపురం నియోజకవర్గ వైకాపా నాయకులు ఉడుముల కోటిరెడ్డి పేర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలను వ్యాప్తి కోసం సీతారాం ఏచూరి అలుపెరుగని కృషి చేశారని తెలిపారు. సుదీర్ఘ కాలం పాటు రాజ్యసభ సభ్యునిగా పని చేసి బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన పాటు పడ్డారని గుర్తుచేశారు. పుచ్చలపల్లి సుందరయ్య తర్వాత సీపీఎం ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రెండో తెలుగు వ్యక్తిగా సీతారాం చరిత్రకెక్కారని అన్నారు. భారత రాజకీయాల్లో ఓ ధ్రువతారగా సీతారాం ఏచూరి నిలుస్తారని అన్నారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు అని, సీతారాం ఏచూరి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ఉడుముల కోటిరెడ్డి పేర్కొన్నారు.