దర్శి నిరుద్యోగ యువత ఉపాధికి తొలి అడుగు వేస్తున్నాం: గొట్టిపాటి లక్ష్మి
ప్రకాశం న్యూస్, దర్శి: గణనాథుని ఉత్సవాల సందర్భంగా నాయుడు యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో దర్శిలోని పుచ్చలమెట్టలో శుక్రవారం ఏర్పాటు చేసిన గణేశుని విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో దర్శి తెదేపా ఇన్‌ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, యువ నాయకులు లలిత్ సాగర్ పాల్గొన్నారు. గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన దర్శి ప్రాంతంలో నిరుద్యోగ సమస్యకు తొలి అడుగు పడబోతుందని, నియోజకవర్గ స్థాయిలో జాబ్ మేళాను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వైకాపా రాజకీయ కుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని మనసారా దేవుని కోరుకుంటున్నానన్నారు. వంద రోజులు పాలనలో రాష్ట్రం అభివృద్ధి వైపు సంక్షేమం వైపు పరుగులు తీస్తుందని, బెజవాడ తుపాను వంటి విపత్తులో ప్రజా నాయకుడిగా మరోసారి ముఖ్య మంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు 10 రోజులు కలెక్టరేట్‌లో ఉండి సాధారణ స్థితికి తీసుకు రాగలిగిన మహా నాయకుడు అని కొనియాడారు. పాలనంటే కార్యాలయాలలో ఉండడం కాదని, ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యలు తీర్చడమే నిజమైన నాయకుని లక్షణం అని నిరూపించిన నేత చంద్రబాబు నాయుడన్నారు. ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి యువతకు స్ఫూర్తి ప్రధాత లోకేష్ బాబు ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి రాష్ట్రంగా పరుగులు తీస్తుందన్నారు. అదే స్ఫూర్తితో దర్శి పట్టణంలో తుపాను బాధితులను ఆదుకునేందుకు కూటమి నేతలతో పాటు వ్యాపార వర్గాలు ముందుకు వచ్చి రూ.37 లక్షలు విరాళంగా అందజేయడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. మన ప్రభుత్వంపై నమ్మకంతో ప్రజలు దాతృత్వం ప్రదర్శించడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో తాను సైతం వ్యక్తిగతంగా రూ.10 లక్షలను ముఖ్యమంత్రికి అందజేశామన్నారు. దర్శి అభివృద్ధికి అందరూ సహకరించి ముందుకు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్మన్ నారాపుశెట్టి పిచ్చయ్య, 10వ వార్డు కౌన్సిలర్ దారం నాగవేణి సుబ్బారావు, పుచ్చలమెట్ట నాయుడు యూత్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి అపూర్వ స్వాగతం పలికారు.