పార్టీ కార్యకర్తకు గొట్టిపాటి లక్ష్మి పరామర్శ
ప్రకాశం న్యూస్, దర్శి: దర్శిలోని పుచ్చలమెట్టలో అంగవైకల్యంతో బాధపడుతున్న పార్టీ కార్యకర్త బాలాజీని తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి శుక్రవారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని, వారి కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని బాలాజీకి, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.