వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధిగా జూపూడి నియామకం
ప్రకాశం న్యూస్, ఒంగోలు: వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రకాశం జిల్లాకు చెందిన జూపూడి ప్రభాకర్‌రావు నియమితులయ్యారు. శుక్రవారం వైకాపా కేంద్ర కార్యాలయంలో వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అధికార ప్రతినిధుల పేర్లను ప్రకటించింది. జిల్లా నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధిగా జూపూడి ప్రభాకర్ రావు నియమితులవడంతో జిల్లాలోని పలువురు వైకాపా ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.