వైకాపా నేత వీరయ్య చౌదరిపై తనయుడు కత్తితో దాడి
ప్రకాశం న్యూస్, దొనకొండ: దొనకొండ మండలంలోని రుద్రసముద్రం గ్రామంలో తండ్రిపై కత్తితో తనయుడు దాడి చేసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. 108 వాహన సిబ్బంది, స్థానికుల కథనం ప్రకారం, గ్రామానికి చెందిన వైకాపా నేత వీరయ్య చౌదరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలున్నారు. వీరయ్య చౌదరికి, ఆయన తనయుడు వీరాచారికి మధ్య గత కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం గ్రామంలో నడిచి వెళ్తున్న వీరయ్య చౌదరిపై తనయుడు వీరాచారి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తలకు తీవ్రగాయాలైన వీరయ్య చౌదరిని మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి గుంటూరుకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.