మాజీ ఎమ్మెల్యే పూల సుబ్బయ్య జీవిత విశేషాలు
మార్కాపురం మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత పూల సుబ్బయ్య సీపీఐ నాయకుడిగా పేరుగాంచారు. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం నుంచి మూడు సార్లు శాసనసభ్యుడిగా విజయం సాధించారు. నిరంతరం కరవు కాటకాలతో సతమతమవుతున్న పశ్చిమ ప్రకాశానికి వెలిగొండ ప్రాజెక్ట్ నీరు మినహా మరో ప్రత్యామ్నాయం లేదని, ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను మళ్లిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పూల సుబ్బయ్య పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా వెలిగొండ ప్రొజెక్టుకు పూల సుబ్బయ్య పేరు పెట్టారు.