మార్కాపురంలో ఉరి వేసుకుని కార్పెంటర్ ఆత్మహత్య
ప్రకాశం న్యూస్, మార్కాపురం: మార్కాపురం పట్టణంలోని సాయిబాలాజీ థియేటర్ సమీపంలో ఉన్న చెక్కల ఫ్యాక్టరీలో తాడుతో ఉరి వేసుకొని వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. మృతుడు స్థానిక భగత్ సింగ్ కాలనీకి చెందిన ఆలూర్తి వీరాచారిగా గుర్తించారు. ఇతను కార్పెంటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడని స్థానికులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.