బూచేపల్లి హౌస్ అరెస్టు.. దర్శిలో 144 సెక్షన్ అమలు
ప్రకాశం న్యూస్, దర్శి: దర్శి నియోజకవర్గంలో వైకాపా శ్రేణులపై పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయంటూ దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మంగళవారం దర్శి పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని మంగళవారం ఉదయం ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ వెంకాయమ్మను పోలీసులు గృహనిర్భందం చేశారు. దర్శిలో పట్టణంలో 144 సెక్షన్ అమలు చేసినట్లు పోలీసులు తెలిపారు. సుమారు 300 మంది పోలీసులు దర్శికి చేరుకుని పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నారు. అలాగే, వైకాపా ప్రజాప్రతినిధులను సైతం పోలీసులు గృహనిర్భందం చేస్తూ నోటీసులు అందజేశారు.
తెదేపా నేతలనూ.. వైకాపా ప్రజాప్రతినిధులతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పాపారావు, మున్సిపల్ ఛైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, తెదేపా నేత దారం సుబ్బారావుతో పాటు పలువురిని పోలీసులు గృహనిర్భందం చేశారు.