చోరీకి గురైన బైక్‌లను పట్టుకున్నట్లు డీఎస్పీ వెల్లడి
ప్రకాశం న్యూస్, మార్కాపురం: ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీకి గురైన ద్విచక్రవాహనాలను గుర్తించినట్లు మార్కాపుం ఎస్డీపీవో యు.నాగరాజు తెలిపారు. శనివారం మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు డీఎస్పీ నాగరాజు, సీఐ సుబ్బారావు, పట్టణ ఎస్సై సైదుబాదు, పీఎస్సై రాజమోహన్ నేతృత్వంలో బృందాలుగా ఏర్పడి నిందితుల వద్ద నుంచి రూ.3.60 లక్షల విలువ చేసే ఐదు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును ఛేదించడంలో పురోగతి చూపిన సీఐ సుబ్బారావు, పట్టణ ఎస్సై సైదుబాబు, పీఎస్సై రాజమోహన్‌రావు, కానిస్టేబుళ్లు వీరభద్రుడు, షేక్ షరీఫ్, కోటి నాయక్‌లను అభినందించి రివార్డులు అందజేశారు.