మాజీ ఎమ్మెల్యే జంకెను పరామర్శించిన వైకాపా నేత ఉడుముల కోటిరెడ్డి

Please Share This Post

మాజీ ఎమ్మెల్యే జంకెను పరామర్శించిన వైకాపా నేత ఉడుముల కోటిరెడ్డి

ప్రకాశం న్యూస్‌, మార్కాపురం: మార్కాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ఇటీవల వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న విషయం విదితమే. చికిత్స అనంతరం ఆయన మార్కాపురంలోని ఆయన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా మార్కాపురం నియోజకవర్గ వైకాపా నేత ఉడుముల కోటిరెడ్డి గురువారం మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఉడుముల కోటిరెడ్డి వెంట ప్రకాశం న్యూస్‌ ఎడిటర్‌ వవెరా, నాగిరెడ్డి తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *