మార్కాపురంలో టపాసుల గోదాములను తనిఖీ చేసిన డీఎస్పీ
ప్రకాశం న్యూస్, మార్కాపురం: మార్కాపురం పట్టణంలోని బొంతల శ్రావణ్ కుమార్, వేముల కేశవరావులకు చెందిన దీపావళి టపాసుల గోదాములను మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టపాసుల గోదాముల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను యజమానులకు తెలియజేశారు. కార్యక్రమంలో సీఐ సుబ్బారావు పాల్గొన్నారు.
గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో రికార్డుల తనిఖీ.. అనంతరం ఆయన మార్కాపురం గ్రామీణ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్‌లోని పలు రికార్డులను తనిఖీ చేసి, పెండింగ్ కేసుల విచారణ, రికార్డుల నిర్వహణకు పలు సూచనలు చేశారు. ఫిర్యాదుదారుల పట్ల మంచిగా ప్రవర్తిస్తూ వారి సమస్యలను పరిష్కరించాలని స్టేషన్ సిబ్బందికి సూచించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని డీఎస్పీ నాగరాజు తెలిపారు.