ప్రజలందరికీ విజయ దశమి శుభాకాంక్షలు: మార్కాపురం వైకాపా నేత ఉడుముల కోటిరెడ్డి
ప్రకాశం న్యూస్, మార్కాపురం: విజయ దశమి పండుగను పురస్కరించుకుని మార్కాపురం నియోజకవర్గ ప్రజలకు వైకాపా సీనియర్ నాయకులు ఉడుముల కోటిరెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. దసరా పండుగ ప్రజల జీవితాల్లో ఆనందాన్ని, నూతన ఉత్సాహాన్ని నింపాలని ఆయన ఆకాంక్షించారు. చెడుపై మంచి విజయం సాధించడమే విజయ దశమి ప్రధాన సందేశమని ఆయన పేర్కొన్నారు. ప్రజలంతా ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలని ఆయన కోరారు.