పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలి: దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ
ప్రకాశం న్యూస్, ముండ్లమూరు: పెండింగ్ కేసులను త్వరగా విచారణ చేసి పరిష్కరించాలని దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ ఆదేశించారు. ఆదివారం ఆయన ముండ్లమూరు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌లో నిర్వహిస్తున్న రికార్డులు, కేసు డైరీలు, రిజిష్టర్లను పరిశీలించారు. పోలీస్ సిబ్బంది పని తీరును తెలుసుకున్నారు. స్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని, నిష్పక్షపాతంగా కేసులను విచారణ చేసి న్యాయం జరిగేలా చూడాలని సిబ్బందికి సూచించారు. గంజాయి, పేకాట, గుట్కాపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. చోరీలు జరగకుండా పోలీస్ అధికారులు రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని సూచించారు.