అనార్గనైజ్‌డ్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కైపు వెంకట కృష్ణారెడ్డి నియామకం
ప్రకాశం న్యూస్, దర్శి: ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గానికి చెందిన కైపు వెంకట కృష్ణారెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అనార్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్, ఎంప్లాయీస్ కాంగ్రెస్ విభాగానికి ఛైర్మన్‌గా నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈనెల 21న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ బాధ్యతను, నమ్మకాన్ని తనపై పెట్టిన కాంగ్రెస్ నాయకత్వానికి, ముఖ్యంగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అనార్గనైజ్‌డ్ సెక్టార్ వర్కర్స్, ఎంప్లాయీస్ కాంగ్రెస్ విభాగం సత్వరం గుర్తించాల్సిన ఒక ముఖ్యమైన విభాగమన్నారు. దేశంలో పెద్ద సంఖ్యలో అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారని, వారి హక్కులు, సంక్షేమంపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక శ్రద్ధ చూపుతూనే ఉందన్నారు. అనార్గనైజ్‌డ్ సెక్టార్ కార్మికులు అనేక సామాజిక, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. వారిని సంఘటితంగా నిలబెట్టి వారి హక్కులు సాధించుకోవడం, వారికి అవసరమైన ప్రభుత్వ సాయం అందించడాన్ని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇందుకు నాయకత్వం వహిస్తూ రాహుల్ గాంధీ “భారత్ జోడో యాత్ర”లో అనుబంధ సంఘాలతో పాటు, అనార్గనైజ్‌డ్ సెక్టార్ కార్మికులు పాల్గొని వారి సమస్యలను నేరుగా రాహుల్ గాంధీకి వివరించిన సందర్భాలున్నాయన్నారు. ఆ సమస్యలను పరిష్కరించే క్రమంలో కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా పాటుపడుతోందని, కాంగ్రెస్ పార్టీ నిరంతరం కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని కృష్ణారెడ్డి పేర్కొన్నారు. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నదని ఆయన పేర్కొన్నారు.