ఏపీ అంచనాల కమిటీ సభ్యుడిగా ఎమ్మెల్యే కందుల
ప్రకాశం న్యూస్, మార్కాపురం: ఆంధ్రప్రదేశ్ అంచనాల కమిటీ సభ్యుడిగా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఎన్నికయ్యారు. శుక్రవారం ఆయా కమిటీలకు ఎన్నికలు జరిగాయి. కందుల నారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి 2009, 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ తనకు అంచనాల కమిటీ సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు. తనపై పెట్టిన బాధ్యతను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.