సబ్ కలెక్టర్ చేతుల మీదుగా బెస్ట్ తహశీల్దార్ అవార్డు అందుకున్న మార్కాపురం తహశీల్దార్
ప్రకాశం న్యూస్, మార్కాపురం: విధి నిర్వహణలో భాగంగా నవంబర్ నెల పనితీరుకు మార్కాపురం డివిజన్ పరిధిలో ఉత్తమ తహశీల్దార్‌గా మార్కాపురం తహశీల్దార్ చిరంజీవి నిలిచారు. ఈ సందర్భంగా సోమవారం మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాగ్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. విధుల పట్ల అధికారులను ఉత్సాహపరిచేందుకు నూతనంగా ఉత్తమ అవార్డును సబ్ కలెక్టర్ ప్రవేశపెట్టారు.