డా.లలిత్సాగర్-లక్ష్మి ఆదర్శ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు: -తెదేపా నేత కామేపల్లి చెంచయ్య
ప్రకాశం న్యూస్, దొనకొండ: పవిత్ర వైద్య వృత్తితో ప్రజల ఆరోగ్యాన్ని నిత్యం కాపాడుతూ దర్శి నియోజకవర్గ ప్రజా శ్రేయస్సు కోసం పరితపిస్తూ, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న తెదేపా నేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దంపతుల 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రామాపురం గ్రామ మాజీ సర్పంచ్ కామేపల్లి చెంచయ్య చౌదరి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎల్లప్పుడూ ఒకరికొకరు తోడుంటూ ఆదర్శవంతమైన జంటగా నిలిచి ప్రజాక్షేత్రంలో ప్రజల ప్రేమానురాగాలను పొందుతున్న లలిత్ సాగర్- గొట్టిపాటి లక్ష్మి ఆదర్శ దంపతులకు భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆయన కోరారు.