శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌కు అభినందనలు తెలిపిన బీజేపీ నేత పీవీ కృష్ణారావు

ప్రకాశం న్యూస్, మార్కాపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు రమేష్ నాయుడును మార్కాపురం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ పీవీ కృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పీవీ మాట్లాడుతూ దేవస్థానం పరిధిలో హిందూ మనోభావాలకు ఇబ్బందిగా కలగకుండా, అన్యమత ప్రచారాలకు ఆస్కారం లేకుండా తిరుపతి స్థాయిలో ఆలయాన్ని అభివృద్ధి పరచాలని రమేష్ నాయుడును కోరినట్లు తెలిపారు. మార్కాపురం చెన్నకేశవ స్వామి దేవాలయాన్ని సందర్శించాల్సిందిగా ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. దీనిపై రమేష్ నాయుడు స్పందిస్తూ త్వరలో మార్కాపురం వస్తానని తెలిపనట్లు పీవీ కృష్ణారావు వెల్లడించారు.