ఓట్ల చోరీపై దర్శిలో సంతకాల సేకరణ ఉద్యమం: కాంగ్రెస్ నేత కైపు

దర్శి, ప్రకాశం న్యూస్: ఓటర్ల జాబితాలో అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఏపీపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 24న ఉదయం 11 గంటలకు దర్శి పట్టణంలో సంతకాల సేకరణ ఉద్యమం నిర్వహిస్తున్నట్లు దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, అసంఘటిత కార్మికుల, ఉద్యోగుల కాంగ్రెస్ రాష్ట్ర ఛైర్మన్ కైపు కృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
