ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం: దేవలూటి శంకర్
ప్రకాశం న్యూస్, మార్కాపురం: దొరల పెత్తనాన్ని ఎదిరించి తెలంగాణ సాయుధ పోరాటానికి దారి చూపిన వీర మాత చాకలి ఐలమ్మ అని రజక విద్యా సేవా సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షులు దేవలూటి శంకర్ అన్నారు. మార్కాపురంలోని ప్రెస్ క్లబ్‌లో గురువారం చాకలి ఐలమ్మ జయంతి వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ వాసర్‌మెన్ సొసైటీ ఫెడరేషన్ డైరెక్టర్ కనిగిరి బాల వెంకటరమణ, తుoబేటి సుబ్రహ్మణ్యం, బొప్పరాజు రమణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం వీరనారి, తెలంగాణ తల్లి, సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ చేసిన పోరాటాన్ని భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు పేరూరి వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు చందలూరు శ్రీను, తుoబేటి రమణ, పగడాల నారాయణ, వంకాయలపాటి వెంకటేశ్వర్లు, రామకృష్ణ, వెంకటేశ్వర్లు, రంగనాయకులు, నల్లబోతుల శ్రీనివాసరావు, గాలం కాశయ్య, శ్రీను, సోమేశుల గీతాభవాని, పీసీ వెంకటేశ్వర్లు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.