శుక్రవారం సాయంత్రం దిల్లీకి సీఎం చంద్రబాబు నాయుడు
ప్రకాశం న్యూస్, అమరావతి: శుక్రవారం సాయంత్రం 4:10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేరుకోనున్నారు. అక్కడి నుంచి 4:30 గంటలకు దిల్లీకి ఆయన బయల్దేరతారు. దిల్లీలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పార్థివదేహానికి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించనున్నారు. అనంతరం శుక్రవారం రాత్రి ఆయన అక్కడే బస చేసి, శనివారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకోనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.