సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్
ల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట దక్కింది. కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. దీంతో ఆయన ఆరు నెలల త్వరాత తీహార్ జైలు నుంచి విడుదల కానున్నారు.
ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం (సెప్టెంబర్ 13) విచారణ చేపట్టింది.
విచారణ సందర్భంగా మద్యం పాలసీ కేసులో సీబీఐ అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది. కానీ ఎందుకు అరెస్ట్ చేసిందో గల కారణాలపై స్పష్టతలేదు. సీబీఐ సమాధానాలు సైతం అర్ధవంతంగా లేవు. అందుకే కేజ్రీవాల్ అరెస్ట్‌తో పాటు జైలు శిక్షను కొనసాగించలేము. కేజ్రీవాల్‌ని సైతం వాంగ్మూలం ఇవ్వమని బలవంతం చేయలేము అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.