మంత్రి సత్యకుమార్ పుట్టినరోజు సందర్భంగా చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
ప్రకాశం న్యూస్, మార్కాపురం: ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా మార్కాపురంలోని చెన్నకేశవ స్వామి దేవాలయంలో ఆయన పేరుతో బీజేపీ నాయకులు పూజలు చేయించారు. కార్యక్రమానికి బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు బొంతల కృష్ణ, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు శాసన సరోజిని, బీజేపీ సీనియర్ నాయకులు పైడిమర్రి శ్రీనివాసరావు, జిల్లా సెక్రటరీ ఎం.చిన్నయ్య, బీజేపీ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి మద్దెల లక్ష్మీ, బీజేపీ టౌన్ సెక్రటరీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.