ఈనెల 28 వరకు విదేశీ పర్యటనలో బూచేపల్లి
ప్రకాశం న్యూస్, దర్శి: ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తనను నియమించడంపై దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, జిల్లాలోని అన్ని నియోజకవర్గ ఇన్‌ఛార్జులకు, వైకాపా ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, ఈనెల 28వ తేదీ వరకు విదేశీ పర్యటనకు వెళ్తున్నానని, తిరిగి వచ్చాక మంచి రోజు చూసుకుని జిల్లా బాధ్యతలు చేపడతానని బూచేపల్లి వెల్లడించారు.