దోర్నాల తెదేపా యువనేత అచ్యుత్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించిన ఎరిక్షన్ బాబు
దోర్నాల, ప్రకాశం న్యూస్: దోర్నాల మండలం చిన్న దోర్నాల గ్రామంలో ఐటీడీపీ అధ్యక్షులు అన్నపురెడ్డి అచ్యుత్ రెడ్డి భౌతికకాయానికి యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. అచ్యుత్ రెడ్డి పార్టీ కోసం ఎనలేని సేవలు చేశారని గుర్తుచేశారు. వారి కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా అందించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.