బొద్దికూరపాడులో ఎక్సైజ్ అధికారుల దాడులు, 15 మద్యం సీసాలు పట్టివేత
ప్రకాశం న్యూస్, దర్శి: దర్శి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం తాళ్ళూరు మండలంలోని బొద్దికూరపాడు గ్రామంలో ఎక్సైజ్ శాఖ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా మద్యం విక్రయాలు చేస్తున్న వెంకటేశ్వర్లు వద్ద నుంచి 15 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో హెడ్ కానిస్టేబుల్ కె.ఏడుకొండలు, కానిస్టేబుళ్లు షేక్.కాసిం పీరా, పి.నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ దర్శి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు ప్రభుత్వ నిబంధనల మేరకే నడుస్తున్నాయన్నారు. దుకాణాల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు లేవని పేర్కొన్నారు. గ్రామాల్లో అక్కడక్కడా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉందని, అందులో భాగంగానే ఆకస్మిక తనిఖీలు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.