మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డికి మాతృవియోగం
ప్రకాశం న్యూస్, మార్కాపురం: మార్కాపురం మాజీ శాసన సభ్యులు కేపీ కొండారెడ్డి మాతృమూర్తి చెంచమ్మ (98) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్యంతో బాధపడుతున్న ఆమె గురువారం స్వగ్రామమైన కొండేపల్లిలో మరణించారు. విషయం తెలుసుకున్న పలువురు ప్రజాప్రతినిధులు, పలు రాజకీయ పార్టీల నేతలు చెంచమ్మ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డికి, ఆయన తనయుడు మాజీ ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డిని పరామర్శించారు.