చాలా ఏళ్ల తర్వాత మార్కాపురం చెరువు అలుగు పారడం సంతోషదాయకం: ఎమ్మెల్యే కందుల
మార్కాపురం, ప్రకాశం న్యూస్: చాలా ఏళ్ల తర్వాత మార్కాపురం చెరువు అలుగు పారడం సంతోషదాయకమని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మార్కాపురం చెరువు అలుగు వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి జల హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చాలా సంవత్సరములు తర్వాత చెరువు అలుగు ప్రవహించటం సంతోషకరమని దీంతో కిందనున్న బోడపాడు చెరువు ను పూర్తిగా నీటితో నింపడానికి అవకాశం ఏర్పడిందని రెండు అలుగులలో ఒక అలుగును మూసివేసి తద్వారా బోడపాడు చెరువును పూర్తిగా నీటితో నింపుతామని దీంతో ఈ ప్రాంతంలో డిప్ బోర్లు నీటితో రీఛార్జ్ అవుతాయని ఇది ఎంతో సంతోషదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ గారు, బిజెపి సీనియర్ నాయకులు పి.వి కృష్ణారావు గారు,జనసేన సయ్యద్ సాధిక్ గారు మరియు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.