బాలినేనిని కలిసిన జనసేన నేతలు
ప్రకాశం న్యూస్, ఒంగోలు: త్వరలో జనసేన పార్టీలో చేరనున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆదివారం జిల్లాకు చెందిన పలువురు జనసేన పార్టీ నాయకులు కలిశారు. బాలినేనిని కలిసిన వారిలో గిద్దలూరు జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు చీకటి వంశీదీప్, జనసేన పార్టీ నేతలు జడా బాలనాగేంద్ర యాదవ్ తదితరులు ఉన్నారు. త్వరలో బాలినేని పార్టీలో చేరిక, తదితర ఏర్పాట్లపై వీరు చర్చించినట్లు సమాచారం.