దర్శి నియోజకవర్గ వైకాపా బూత్ కమిటీ అధ్యక్షులుగా కాలూరి రమణయ్య

Please Share This Post

దర్శి నియోజకవర్గ వైకాపా బూత్ కమిటీ అధ్యక్షులుగా కాలూరి రమణయ్య

ప్రకాశం న్యూస్‌, దర్శి: దర్శి నియోజకవర్గ వైసీపీ బూత్ కమిటీ విభాగం అధ్యక్షులుగా దొనకొండ మండలం మల్లంపేట గ్రామానికి చెందిన కాలూరి రమణయ్యను నియమిస్తూ వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైకాపా కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రమణయ్య పవర్ ఎలక్ట్రానిక్స్‌లో ఎంటెక్ చేశారు. ప్రస్తుతం దొనకొండ మండల వైకాపా సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా కాలూరి రమణయ్య మాట్లాడుతూ తనపై నమ్మకంతో కీలకమైన పదవి రావడానికి గల కారణమైన వైకాపా ప్రకాశం జిల్లా అధ్యక్షులు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి, దొనకొండ మండల వైకాపా మాజీ కన్వీనర్ కాకర్ల క్రిష్ణారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాలూరి రమణయ్యకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *