ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించుకుందాం: దేవలూటి శంకర్
ప్రకాశం న్యూస్, మార్కాపురం: చిట్యాల ఐలమ్మ జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుందామని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రజక విద్యా సేవా సంక్షేమ సంఘం అధ్యక్షులు దేవలూటి శంకర్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మీడిమాతో మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడిన వీరనారి, తెలంగాణ తల్లి, సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ స్ఫూర్తిని భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈనెల 26వ తేదీ గురువారం తెలంగాణ సాయుధ పోరాట ప్రతీక, వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రజక కులస్తులు, రజక విద్యా సేవా సంక్షేమ సంఘ సభ్యులు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర కమిటీ తరఫున కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు 80966 46072/ 63043 3529 నంబర్లలో సంప్రదించాలన్నారు.