మార్కాపురం డీఎస్పీగా నాగారాజు నియామకం
ప్రకాశం న్యూస్, మార్కాపురం: మార్కాపురం డివిజన్ డీఎస్పీగా యు.నాగరాజును నియమిస్తూ ఆదివారం డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈయన గతంలో ఒంగోలు డీఎస్పీగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం వెయిటింగ్ నుంచి మార్కాపురం డీఎస్పీగా బదిలీపై రానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 47 మంది డీఎస్పీలకు పోస్టింగులు ఇస్తూ ఉత్తర్వులు విడుదల అయ్యాయి. ఇటీవల వరకు మార్కాపురం డీఎస్పీగా బాలసుందరరావు విధులు నిర్వర్తించి బదిలీపై వెళ్లారు.