మార్కాపురం డీఎస్పీగా నాగరాజు బాధ్యతల స్వీకరణ
ప్రకాశం న్యూస్, మార్కాపురం: మార్కాపురం నూతన డీఎస్పీగా యు.నాగరాజు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను మార్కాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సుబ్బారావు, పట్టణ ఎస్సై సైదుబాబు, మార్కాపురం గ్రామీణ ఎస్సై అంకమ్మరావు, ట్రైనీ ఎస్సై మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్కను డీఎస్పీకి అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ మార్కాపురం పోలీస్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు.