ముస్లిం సోదరసోదరీమణులందరికీ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు: ఉడుముల కోటిరెడ్డి
ప్రకాశం న్యూస్, మార్కాపురం: మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకొనే మిలాద్ ఉన్ నబీ ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు నింపాలని కోరుకుంటూ మార్కాపురం నియోజకవర్గ ముస్లిం సోదర సోదరీమణులకు ఈద్ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలను మార్కాపురం నియోజకవర్గ వైకాపా సీనియర్ నాయకులు ఉడుముల కోటిరెడ్డి తెలియజేశారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాద్ ఉన్ నబీ ప్రేమ, సహనం, శాంతి, సామరస్యాలకు ప్రతీక అని ఆయన పేర్కొన్నారు.