లయన్స్ క్లబ్ ఆఫ్ దర్శి స్నేహ ఆధ్వర్యంలో పండ్ల మొక్కలు నాటిన సభ్యులు
ప్రకాశం న్యూస్, దర్శి: పర్యావరణ పరిరక్షణలో భాగంగా శుక్రవారం దర్శిలోని క్రిస్టియన్‌పాలెంలో గల ఎంపీపీ పాఠశాల ఆవరణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ దర్శి స్నేహ ఆధ్వర్యంలో పండ్ల మొక్కలు నాటారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ రఘురామయ్య, బి.రమాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం వాతావరణంలో జరుగుతున్న మార్పులకు అనుకూలంగా ప్రతిఒక్కరూ మొక్కలను నాటాలని పేర్కొన్నారు. అంతరించిపోతున్న పలు రకాల పక్షుల మనుగడను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలను విధిగా నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఎన్విరాన్‌మెంట్ ఛైర్మన్ లయన్ కల్లూరి విద్యాసాగర్‌రెడ్డి, క్లబ్ గైడింగ్ మెంబర్ లయన్ ఆంజనేయులు, క్లబ్ అధ్యక్షుడు టి.ఫణిబాబు, సెక్రటరీ పీవీ సత్యనారాయణ గుప్తా, ట్రెజరర్ టి.అశోక్, క్లబ్ సభ్యులు జి.శ్రీధరరావు, బి.నాగార్జునరెడ్డి, స్కూల్ హెడ్ మాస్టర్ హైమావతి, షరీఫ్, వెంకటేశ్వర్లు, శ్రీను, పూర్ణిమ, స్రవంతి, ప్రసునాంబ, షరా, హజరత్ తదితరులు పాల్గొన్నారు.