వరద బాధితులకు నిత్యవసర సరకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కందుల తనయుడు విగ్నేష్‌రెడ్డి
ప్రకాశం న్యూస్, మార్కాపురం: మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఆదేశాల మేరకు ఆయన తనయుడు కందుల విగ్నేష్‌రెడ్డి ఆధ్వర్యంలో మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇటీవల భారీ వర్షాలకు అతలాకుతలమైన విజయవాడ నగరంలో శుక్రవారం ఇంటింటికి తిరిగి నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, విజయవాడ సెంట్రల్ శాసన సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొని ప్రజలకు నిత్యవసర సరకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానికులు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.