ఆదివాసి జాతి యోధుడు బిర్సాముండా జయంతి వేడుకల్లో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే బాలరాజు

పోలవరం, ప్రకాశం న్యూస్: ఆదివాసి జాతి యోధుడు బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా, కేఆర్ పురం ఐటిడిఏలో శనివారం నిర్వహించిన వేడుకలకు పోలవరం ఎమ్మెల్యే శ్రీ చిర్రి బాలరాజు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటిడిఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బిర్సా ముండా, కొమరం భీం సహా ఆదివాసీ మహనీయుల విగ్రహాలకు ఎమ్మెల్యే గారు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తరువాత ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషకాహార – ఆర్గానిక్ ఫుడ్ స్టాల్‌ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. విద్యార్థులు విన్యసించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి వారిని అభినందించారు. అనంతరం బిర్సా ముండా జయంతి సందర్భంగా వైజాగ్‌లో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్‌లో విజయాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే బాలరాజు గారు మాట్లాడుతూ –
“ఆదివాసీ ప్రజల హక్కుల కోసం, అణగారిన వర్గాల కోసం పోరాడిన బిర్సా ముండా వంటి మహనీయుల త్యాగాలు ప్రతి యువతకు ప్రేరణ అని, వారి ఆశయాలను నిలబెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.ఆదివాసీ గ్రామాల అభివృద్ధి, విద్య, ఆరోగ్యం, జీవనోపాధి కోసం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో శాప్ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి,ఎస్టీ కమిషన్ సభ్యులు కాకి లక్ష్మి,గ్రీన్ & బ్యూటిఫికేషన్ డైరెక్టర్ పాదం కృష్ణ,బుట్టాయిగూడెం మండల అధ్యక్షులు బుచ్చిరాజు,ఐటీడీఏ అధికారులు,వివిధ శాఖల అధికారులు,కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.