ఈనెల 14న జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి: ఎస్పీ
కేసుల సత్వర పరిష్కారానికి రాజీమార్గమే రాజమార్గమని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పేర్కొన్నారు. ఈ నెల 14న జరిగే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా కృషి చేయాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. తమ స్టేషన్ల పరిధిలోని కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, కుటుంబ తగాదాలు, భూతగాదాలు, మోటార్ బైక్ యాక్సిడెంట్, చిట్ ఫండ్ లాంటి కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రాజీపడే కేసుల జాబితాను రూపొందించి, ఇరువర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించాలని తెలిపారు. కేసుల పరిష్కారంపై కక్షిదారులకు అర్థమయ్యేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. పలు సందర్భాల్లో పరస్పరం కేసులు పెట్టుకున్న ఇరు వర్గాల వారు సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ డబ్బు, సమయం వృథా కాకుండా పరస్పర అంగీకారంతో రాజీ చేసుకునే అవకాశం జాతీయ లోక్ అదాలత్ ద్వారా ఉంటుందన్నారు. కక్షిదారులంతా ఈ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొవాలని ఎస్పీ దామోదర్ సూచించారు.