ఈనెల 16న ప్రజాసమస్యల పరిష్కార వేదిక రద్దు: ఎస్పీ దామోదర్
ప్రకాశం న్యూస్, ఒంగోలు: ఈనెల 16వ తేదీ సోమవారం మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే “ప్రజా సమస్యల పరిష్కార వేదిక”(పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్) మీకోసం కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పేర్కొన్నారు. జిల్లాలోని ఫిర్యాదారులు ఈ విషయాన్ని గమనించి దూర ప్రాంతాల నుంచి ఎవరూ రావద్దని ఆయన సూచించారు.