మార్కాపురం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
ప్రకాశం న్యూస్, మార్కాపురం: భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా శనివారం మార్కాపురం బాలుర ఉన్నత పాఠశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. స్థానిక వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ పీవీ కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కాపురం నియోజకవర్గంలో బీజేపీ సభ్యత్వ నమోదు ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోందన్నారు. బీజేపీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించి, వారికి సభ్యత్వం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలంతా బీజేపీ సభ్యత్వాన్ని పొంది దేశ ప్రగతిలో భాగస్వామ్యం కావాలని పీవీ కృష్ణారావు పిలుపునిచ్చారు.