
ఎమ్మెల్యే బూచేపల్లికి కృతజ్ఞతలు తెలిపిన నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు రమణ
ప్రకాశం న్యూస్, దర్శి: దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే, వైకాపా ప్రకాశం జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ఆదివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో దర్శి నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షులు కాలూరి అజయ్ రమణ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షులుగా తనకు అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే బూచేపల్లికి అజయ్ రమణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి సూచించారు. కార్యక్రమంలో దొనకొండ మండలం మల్లంపేట గ్రామ వైకాపా నాయకులు దూదేకుల ఇస్మాయిల్ ఉన్నారు.