జిల్లాలో 13 మంది ఎస్సైలు బదిలీ
ప్రకాశం న్యూస్, ఒంగోలు: జిల్లాలో 13 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ సోమవారం ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఉత్తర్వులు విడుదల చేశారు. టి.త్యాగరాజును కనిగిరి పోలీస్ స్టేషన్ నుంచి వీఆర్‌కు, టి.శ్రీరామ్‌ను వీర్ నుంచి కనిగిరి పీఎస్‌కు, పి.శివనాగరాజును హనుమంతునిపాడు పీఎస్ నుంచి జిల్లా వీఆర్‌కు, కె.మాధవరావును జిల్లా వీఆర్ నుంచి హనుమంతునిపాడు పీఎస్‌కు, జి.కోటయ్యను వీఆర్ నుంచి పీసీ పల్లి పీఎస్‌కు, టి.కిశోర్‌బాబును ఒంగోలు వన్ టౌన్ పీఎస్ నుంచి పామూరు పీఎస్‌కు, బి.ప్రేమ్‌కుమార్‌ను సీఎస్‌పురం పీఎస్ నుంచి వీఆర్‌కు, ఆర్.సుమన్‌ను వీఆర్ నుంచి సీఎస్ పురం పీఎస్‌కు, కె.మధుసూదన్‌రావును కొమరోలు పీఎస్ నుంచి వెలిగండ్ల పీఎస్‌కు, వెంకటేశ్వర్లు నాయక్‌ను వీఆర్ నుంచి కొమరోలు పీఎస్‌కు, టి.రాజ్‌కుమార్‌ను వీఆర్ నుంచి కొనకొనమిట్ల పీఎస్‌కు, బ్రహ్మనాయుడును వీఆర్ నుంచి తర్లుపాడు పీఎస్‌కు, పి.రాజేష్‌ను వీఆర్ నుంచి పుల్లలచెరువు పీఎస్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.