బాధిత కుటుంబానికి రూ.7 లక్షల చెక్కు అందజేసిన తెదేపా ఇన్‌ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి
ప్రకాశం న్యూస్, దర్శి: దర్శి నగర పంచాయతీ పరిధిలోని శివరాజ్‌నగర్‌కు చెందిన పులి వెంకట్ రెడ్డి గతంలో అప్పుల బాధతో మృతి చెందారు. దీంతో ఆయన భార్య సుబ్బరత్తమ్మకు మంగళవారం ప్రభుత్వం తరఫున రూ.7,00,000 చెక్కును దర్శి తెదేపా ఇన్‌ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి అందజేశారు. కార్యక్రమంలో అగ్రికల్చర్ AD బాలాజీ నాయక్, AO బాలకృష్ణ, RBK విలెజ్ అసిస్టెంట్ అనూష, దర్శి మున్సిపల్ ఛైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, కౌన్సిలర్లు, తెదేపా, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అనంతరం లక్ష్మి మాట్లాడుతూ తమది రైతు పక్షపాత ప్రభుత్వమన్నారు. గత ప్రభుత్వం రైతులను పట్టించుకోకుండా దగా చేసిందన్నారు. నీటి విడుదలలో నిర్లక్ష్యం వహించారని, ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు సకాలంలో అందించలేదన్నారు. ధాన్యం రైతు భరోసా కేంద్రాల ద్వారా వైకాపా నాయకులు కొనుగోలు చేసి సరైన ధర ఇవ్వకుండా దగా చేశారన్నారు. ప్రస్తుతం సాగుపై దృష్టి సారించారని, పొలం పోదాం పంటలను కాపాడదాం అనే కార్యక్రమంలో ద్వారా ప్రజాప్రతినిధులను, అధికారులను పొలాలకు పంపించి సకాలంలో విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు సరఫరా అయ్యేందుకు చర్యలు చేపట్టారన్నారు.