తెలుగుదేశం పార్టీ పదవి అంటే ఒక గౌరవం లా కాకుండా, బాధ్యతగా తీసుకోవాలి: డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

Please Share This Post

తెలుగుదేశం పార్టీ పదవి అంటే ఒక గౌరవం లా కాకుండా, బాధ్యతగా తీసుకోవాలి: డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

దర్శి, ప్రకాశం న్యూస్‌: దర్శి నియోజకవర్గంలోని మండల కమిటీలు, గ్రామ కమిటీలు, క్లస్టర్ లు, యూనిట్, విలేజ్ బూత్ కమిటీల ప్రమాణస్వీకారం మహోత్సవంలో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ లక్ష్మీ గారు, మాజీ శాసనసభ్యులునారపుశెట్టి పాపారావు గారు, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు, దర్శి మార్కెట్ యాడ్ చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈసందర్బంగా డా|| గొట్టిపాటి లక్ష్మీ గారు మాట్లాడుతూ…

ప్రజల వద్దకు వెళ్లి పార్టీ బలం పెంచే దిశగా ప్రతి నాయకుడు బాధ్యతగా పనిచేయాలని హేతువు పలికారు. అధికారంలో ఉన్న మన కూటమి ప్రభుత్వంలో మన ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేర్చాల్సిన బాధ్యత నాయకులుగా మనపై ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. మనం నిబద్ధతతో పని చేసినప్పుడు, అదే పార్టీకి ప్రజల్లో మంచి పేరు తెస్తుందని, చిన్నచిన్న తప్పులు నాయకులు చేస్తే అది పార్టీకి చెడ్డ పేరు తెస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు.

ప్రజలు మనపై ఉంచిన విశ్వాసాన్ని మనం నిలబెట్టుకుని చైతన్యంతో, పార్టీ ఉజ్వల భవిష్యత్తు నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు, యువనేత ఐటీ విద్యాశాఖమాత్యులు నారా లోకేష్ బాబు గారు నిరంతరం పడుతున్న కష్టం చూస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం చేస్తున్న కృషిని మనం స్ఫూర్తిగా తీసుకొని తల్లి లాంటి పార్టీ అధికారంలో ఉంటేనే బిడ్డలమైన కార్యకర్తల భవిష్యత్తు బాగుంటుందని గుర్తించాలన్నారు. మన నాయకుడు కష్టం, కృషితోనే రాష్ట్ర భవిష్యత్తు ఉందని ప్రతి కార్యకర్తకు తెలియజేయాలన్నారు. టిడిపిలో నాయకత్వం అనేది ఒక బాధ్యత, పదవి అంటే ఒక గౌరవం, ప్రజల్లో ఒక నమ్మకం, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ ఆనాడు తెలుగుదేశం పార్టీని ప్రజల కోసం, ప్రజల అభ్యున్నతి కోసం స్థాపించిన పార్టీ. ఆ పార్టీని ముందుకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆమె వివరించారు. ముఖ్యంగా కూటమి పక్షాలైన మిత్రపక్షాలను కలుపుకు పోతూ, గ్రామాలలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, అభివృద్ధి – సంక్షేమం అందరికీ చేరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె కోరారు. అదేవిధంగా వైసీపీ ఉనికి కోసం చేస్తున్న అలజడులను, ఉద్యమాలను తిప్పి కొట్టే విధంగా ప్రతి నాయకుడు గళం విప్పాలని, కార్యకర్తలలో చైతన్యం కలిగించాలని, మనోధైర్యాన్ని నింపాలని దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగిరే వరకు ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త చేయి చేయి కలిపి పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం లో తాళ్లూరు మండల ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, నియోజకవర్గం లోని మండల పార్టీ అధ్యక్షులు దర్శి మరెళ్ల వెంకటేశ్వర్లు, దొనకొండ మోడీ ఆంజనేయులు, కురిచేడు పిడతల నెమిలయ్య, ముడ్లమూరు కూరపాటి శ్రీనివాసరావు, తాళ్లూరు మేడగం వెంకటేశ్వర రెడ్డి, దర్శి టౌన్ చిన్నా, వివిధ హోదాల్లో ఉన్న టిడిపి సీనియర్ నాయకులు, మహిళలు, క్లస్టర్, యూనిట్, బూత్ మరియు టౌన్, గ్రామ పార్టీ అధ్యక్షులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *