మార్కాపురం డీఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన వైకాపా నేత ఉడుముల కోటిరెడ్డి
ప్రకాశం న్యూస్, మార్కాపురం: మార్కాపురం నూతన డీఎస్పీ యు.నాగరాజును బుధవారం మార్కాపురం నియోజకవర్గ వైకాపా సీనియర్ నేత ఉడుముల కోటిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీఎస్పీ నాగరాజుకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఉడుముల కోటిరెడ్డి మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై దృష్టి సారించాలన్నారు. రహదారులపై యథేచ్ఛగా ఆవులు సంచరిస్తూ వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నాయని, వాటిని రహదారిపైకి రాకుండా సంబంధిత యజమానులకు అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే, గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జర్నలిస్ట్ వవెరా, వైకాపా యువ నాయకులు మారంరెడ్డి నాగిరెడ్డి, మారంరెడ్డి పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.