సీఐ, ఎస్సైలను మర్యాదపూర్వకంగా కలిసిన మార్కాపురం వైకాపా నేత ఉడుముల కోటిరెడ్డి
ప్రకాశం న్యూస్, మార్కాపురం: మార్కాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సుబ్బారావు, మార్కాపురం గ్రామీణ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ అంకమ్మరావును మార్కాపురం నియోజకవర్గ వైకాపా నాయకులు ఉడుముల కోటిరెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి పుష్ఫగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మార్కాపురం నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని సీఐ, ఎస్సైలను కోరారు. కార్యక్రమంలో జర్నలిస్ట్ వవెరా, బొందలపాడు వైకాపా నాయకులు మారంరెడ్డి నాగిరెడ్డి, సివిల్ ఇంజినీర్ హరిప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.