సబ్ కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన వైకాపా నేత ఉడుముల కోటిరెడ్డి
ప్రకాశం న్యూస్, మార్కాపురం: మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట్ త్రివినాగ్‌ను మార్కాపురం నియోజకవర్గ వైకాపా సీనియర్ నాయకులు ఉడుముల కోటిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సబ్ కలెక్టర్‌తో ఉడుముల కోటిరెడ్డి మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అలాగే, డివిజన్‌లోని రెవెన్యూ సమస్యలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జర్నలిస్ట్ వవెరా, వైకాపా యువ నాయకులు మారంరెడ్డి నాగిరెడ్డి, పెద్దిరెడ్డి తదితరులు ఉన్నారు.