దర్శి నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే ర్యాలీ హాస్యాస్పదం: కాంగ్రెస్‌ నేత కైపు కృష్ణారెడ్డి

Please Share This Post

దర్శి నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే ర్యాలీ హాస్యాస్పదం: కాంగ్రెస్‌ నేత కైపు కృష్ణారెడ్డి

దర్శి, ప్రకాశం న్యూస్‌: కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేట్ పరం చేయడం కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దర్శి నియోజకవర్గం లో వైసీపీ ఎమ్మెల్యే ర్యాలీ చేయడం హాస్యాస్పదం. దర్శి కి ఏ రోజు అయిన మెడికల్ కాలేజీ గానీ 100 పడకల హాస్పిటల్ కావాలి అని మీడియా ముందు గానీ అసెంబ్లీ లో గానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రికి చిన్న వినతి పత్రం అయినా ఇచ్చాడా?

దర్శి నియోజకవర్గం లో ప్రజలకి కాలేజీలో హాస్పటల్లో అవసరం లేదా అందరూ అంత సంతోషంగా ఉన్నారా అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది

చిన్న ఆరోగ్య సమస్య వస్తే నరసరావుపేటకో, ఒంగోలుకో గుంటూరుకు పరిగెత్తుకుంటూ సామాన్య ప్రజలు వెళ్తుంటే మీ కళ్ళకి కనపడటం లేదా?

అలాగే ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు గారు కనిగిరి పర్యటనలో భాగంగా వెలుగొండ ప్రాజెక్టు గురించి గానీ దొనకొండలో నిర్మించాల్సిన పరిశ్రమల గురించి గానీ దర్శి నియోజకవర్గం తుఫాను వల్ల నష్టపోయిన రైతుల కష్టాల గురించి గానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోవడం బాధాకరం

మరి కూటమి ప్రభుత్వం దర్శి నియోజకవర్గం ఇన్చార్జి లక్ష్మీ గారు నియోజకవర్గం ప్రజలకి ఏ విధంగా సమాధానం చెప్తారు

దర్శి నియోజకవర్గం ప్రజలు అంటే అటు వైసిపి గాని కూటమి ప్రభుత్వానికి గాని ఎందుకు అంత చిన్న చూపు

అభివృద్ధికి ఆమడ దూరంలో దర్శి నియోజకవర్గం

ఇటీవల సంభవించిన తుఫాన్ వల్ల నియోజకవర్గంలో సుమారు 15 వేల ఎకరాలు పంట నష్టం జరిగితే కనీసం కేంద్రం నుంచి వచ్చిన కమిటీ నియోజకవర్గంలో సందర్శించకపోవడం బాధాకరం

కూటమి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిక నియోజకవర్గంలో నష్టపోయిన రైతులకు ఎకరాకి 25వేల రూపాయల లెక్కన డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోకి సత్వరమే పంపించాల్సిందిగా కోరుచున్నాము

  • కైపు వెంకటకృష్ణా రెడ్డి, రాష్ట్ర అసంఘటిత కార్మికుల మరియు ఉద్యోగుల చైర్మన్
    దర్శి నియోజకవర్గం ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *