
ప్రకాశం న్యూస్, గిద్దలూరు: మంగళవారం ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మార్కాపురం జిల్లాలో పర్యటిస్తున్నట్లు సమాచారం అందుతుంది. రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయాన్ని ఎస్పి సందర్శించనున్నారు. ఏప్రిల్ 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఎమ్మెల్యే అశోక్ రెడ్డితో కలిసి ఎస్పీ పరిశీలించనున్నారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లను ఎస్పీ తనిఖీ చేయనున్నారు.